భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షిక, 96వ ఆవిర్భావ దినోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి మీదుగా లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ప్రదర్శనలో సీపీఐ నాయకులు, కార్మికులు, కర్షకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అంతకుముందు సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఎగురవేశారు. శత వార్షికోత్సవాలకు చేరువవుతున్న వేళ.. మరింత విస్తృతంగా ప్రజాపోరాటాలకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తామని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.