గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కరోనాను జయించి ఆరుగురు పోలీసులు విధుల్లో చేరారు. వీరికి డీఎస్పీ దుర్గాప్రసాద్ స్వాగతం పలికారు. ఇతర పోలీసు అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. తోటి సిబ్బంది వారిపై పూల వర్షం కురిపించారు. కొవిడ్‌ను జయించిన పోలీసులు ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని డీఎస్పీ చెప్పారు. వీరికి కొన్నిరోజులు స్టేషన్లోనే సాధారణ విధులు కేటాయిస్తామని తెలిపారు.
మంగళగిరిలో కొవిడ్‌ను జయించి విధుల్లో చేరిన పోలీసులు - మంగళగిరి పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరిన కొవిడ్ విజేతలు
మంగళగిరి పోలీస్ స్టేషన్లో కరోనాను జయించి విధుల్లో చేరిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ, ఇతర అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. కొవిడ్‌ను జయించిన వీరు ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని డీఎస్పీ చెప్పారు.
![మంగళగిరిలో కొవిడ్‌ను జయించి విధుల్లో చేరిన పోలీసులు covid warrior joins duty in mangalagir police station guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8354939-970-8354939-1596970557933.jpg)
మంగళగిరిలో కొవిడ్‌ను జయించి విధుల్లో చేరిన పోలీసులు