ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రి మెట్లపైనే తుదిశ్వాస విడిచిన కొవిడ్‌ బాధితురాలు - women dead news

కరోనా సోకిన ఓ మహిళ ఆసుపత్రి మెట్లపైనే మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే బతికేదని మృతురాలి కుటుంబ సభ్యులు విలపించారు.

covid victim died
రోదిస్తున్న మృతురాలి బంధువు

By

Published : Apr 17, 2021, 2:55 PM IST

ఆసుపత్రి మెట్లపైనే మరణించిన కొవిడ్‌ బాధితురాలు

గుంటూరు జిల్లాలో కొవిడ్‌ బారిన పడిన ఓ మహిళ ఆసుపత్రి మెట్లపైనే తుదిశ్వాస విడిచారు. కొలకలూరుకు చెందిన గుంటుపల్లి భారతికి జ్వరం వస్తుండటంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలింది. గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్తే పడకలు ఖాళీ లేవని చెప్పారు. చేసేదిలేక తిరిగి ఇంటికి వచ్చారు. అర్థరాత్రి సమయంలో గుండెలో నొప్పి రావటంతో 108కి సమాచారం ఇచ్చారు. 108 వేరేచోటికి వెళ్లటంతో కుటుంబ సభ్యులు భారతిని ఆటోలో అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆసుపత్రి మెట్లపైనే భారతి పడిపోయారు. వైద్య సిబ్బంది పరీక్షించి చనిపోయినట్లు నిర్దరించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే భారతి బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details