ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిందితుడికి కరోనా పాజిటివ్... పోలీసులకు కొవిడ్ పరీక్షలు

కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి గంజాయి తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి... డ్రైవర్​ను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడికి కరోనా నిర్థరణ పరీక్షలు చేయించగా... పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అరెస్టు చేసినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

covid test for medikonda police
పోలీసులకు కొవిడ్ పరీక్షలు

By

Published : Jun 18, 2020, 12:13 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన ఐదుగురు పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా దాచేపల్లి నుంచి గుంటూరుకు వస్తున్న ఆటోను పేరేచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఆటోలో గంజాయి, గుట్కాలు ఉండటంతో, ఆటోను సీజ్ చేసి డ్రైవర్​ను అరెస్టు చేశారు. రిమాండ్​కు తరలించే ముందు నిందితుడికి కరోనా పరీక్షలు నిర్వహించటంతో పాజిటివ్​గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు... అప్పుడు విధుల్లో ఉన్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుల్, ఒక హోంగార్డుకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details