ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2021, 4:37 PM IST

Updated : Apr 16, 2021, 5:19 PM IST

ETV Bharat / state

తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానితులు.. పరీక్షలు లేకుండానే చికిత్స!

తెనాలి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి వైద్యులు.. కొవిడ్ అనుమానితులకు చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి నాలుగు రోజులవుతున్నా ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదని బాధితులు చెబుతున్నారు. మందులు మాత్రం ఇస్తున్నారని.. అవి ఎందుకు ఇస్తున్నారో.. ఇంజక్షన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

tenali govt hospital
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా అనుమానితులకు చికిత్స

తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానితులు.. పరీక్షలు లేకుండానే చికిత్స!

గుంటూరు జిల్లా తెనాలిలో అత్యవసర విభాగంలో కరోనా అనుమానితులకు వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి రోజులు గడుస్తున్నా.. కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజన సౌకర్యాలు కూడా లేవని వాపోతున్నారు. సాధారణ చికిత్స కోసం వచ్చేవారు సైతం వీరిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది.

ఇదిలావుంటే అత్యవసర విభాగంలో ఉంచి కరోనా అనుమానితులకు చిక్సిత్స అందిస్తున్న విషయం తనకు తెలియదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: కొల్లిపర రిజిస్ట్రార్ కార్యాలయం మూసివేత

Last Updated : Apr 16, 2021, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details