షోరూం లోపల కూడా ఎవరైనా వినియోగదారులు మాస్కులు ధరించకపోతే వారిని అప్రమత్తం చేస్తుంది. రెండోసారి వారి చేతులు శానిటైజ్ చేస్తుంది. ఇలా రక్షణ వ్యవస్థ కోసం ఈ రోబోని వినియోగిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో వినియోగదారుల రక్షణ కోసమే దీనిని ప్రత్యేకంగా చెన్నైలో రూ.5లక్షలతో రూపొందించి తీసుకువచ్చారు. షోరూం కి వచ్చే వినియోగదారులు రోబోని చూసి కస్టమర్స్ ఆశ్ఛర్యానికి లోనవుతున్నారు. దీని పేరు జెఫిరా..కోవిడ్ స్టేఫ్టీ రోబో
నా పేరు..జెఫిరా! నేనో... కొవిడ్ సేఫ్టీ రోబోని - గుంటూరులో కొవిడ్ సేఫ్టీ రోబో జెఫిరా వార్తలు
గుంటూరులోని ఓ వస్త్ర దుకాణం నిర్వాహకులు వినియోగదారుల రక్షణ కోసం రోబోని ఏర్పాటు చేశారు. వినియోగదారుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు షోరూం గురించి ఈ రోబో అవగాహన కల్పిస్తోంది. చెన్నై నుంచి తెప్పించిన రోబో.... షోరూంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కొవిడ్ సేఫ్టీ రోబో
ఇదీ చూడండి.కోటి తలంబ్రాలకు వరిపంట కోత ప్రారంభం