కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో అధికారులు ఆంక్షలు విధించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న దుగ్గిరాల, రేవేంద్రపాడు, చింతలపూడి గ్రామాల్లో ఉదయం 6 నుంచి 11గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ఈ మేరకు తహసీల్దార్ మల్లీశ్వరి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఆ సమయంలో మాత్రమే తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి తీసుకెళ్లాలని సూచించారు.
దుగ్గిరాలలో కొవిడ్ విజృంభణ.. ఆంక్షలు విధించిన అధికారులు - దుగ్గిరాలలో కరోనా విజృంభణ వార్తలు
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు విధించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. ఈ నెల 27 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
దుగ్గిరాలలో కొవిడ్ విజృంభణ
ఈ నెల 27వ తేదీ వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు కూడా అనవసరంగా బయటకు రావొద్దని, ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండరాదని సూచించారు. కరోనా రెండో విడత విజృంభణ తర్వాత దుగ్గిరాల మండలంలో 10మంది మరణించారు. ఇప్పటికే 100కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి:చంద్రబాబు సభపై రాళ్ల దాడి అవాస్తవం: హోంమంత్రి సుచరిత