గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో నివాసం ఉంటున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిద్దరూ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు ఎక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అనే వివరాలను అధికారులు సేకరించారు.
నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ - corona updates in guntur dst
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు నాగులపాడును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు.
covid positive in guntur dst pedanandipadu mandal nagulapdu
ఆ బాధితులు నివాసం ఉంటున్న రూమ్‌లో ఒక మహిళ పనులు చేసేది. ఆమె కాకుమాను మండలం కొమ్మూరుకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెను ఇంట్లోనే ఉండాలని బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. నాగులపాడును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
ఇదీ చూడండి