కొవిడ్ చికిత్స కోసం గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వృద్ధుడు.. ఆసుపత్రి బయట ఉండటం కలకలం రేపింది. నగరం మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు ఈనెల 16న ఆసుపత్రికి వచ్చాడు. 17వ తేదీన ఆసుపత్రి వార్డు నుంచి బయటకు వెళ్లాడు. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం తింటూ ఆసుపత్రి బయటనే ఉన్నాడు.
సిబ్బంది నిర్లక్ష్యం...ఆసుపత్రి బయట తిరుగుతున్న కొవిడ్ బాధితుడు - తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి బయటే కొవిడ్ బాధితుడు
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితుడు.. గత కొన్ని రోజులుగా బయట తిరుగుతున్న ఘటన కలకలం రేపింది. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం కోసం ఆసుపత్రి బయట తిరుగుతున్నాడు. మంగళవారం వృద్ధుడి బంధువులు వచ్చే వరకు కొవిడ్ బాధితుడు బయట తిరుగుతున్న విషయం ఆసుపత్రి సిబ్బంది గుర్తించకపోవడం గమనార్హం.
![సిబ్బంది నిర్లక్ష్యం...ఆసుపత్రి బయట తిరుగుతున్న కొవిడ్ బాధితుడు సిబ్బంది నిర్లక్ష్యం...బయటతిరుగుతున్న కొవిడ్ బాధితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8900648-978-8900648-1600794857030.jpg)
సిబ్బంది నిర్లక్ష్యం...బయటతిరుగుతున్న కొవిడ్ బాధితుడు
మంగళవారం వృద్ధుడి కుటుంబ సభ్యులు అతని కోసం తెనాలి వచ్చారు. వృద్ధుడిని రోడ్డు పక్కన చూసి వెంటనే అధికారులకు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది వృద్ధుడిని ఆసుపత్రి వార్డులోకి తరలించారు. ఆసుపత్రి నుంచి కొవిడ్ రోగి బయటకు వెళ్లి తిరుగుతున్నా... సరైన పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి :తేనెటీగల దాడిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మృతి