ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ సోకిందని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం.. చివరికి కూర్చున్నచోటే...! - జగ్గడిగుంటపాలెం టిడ్కో కోవిడ్ కేంద్రం

కరోనా సోకిందని మనస్థాపనానికి గురై పలుమార్లు ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి ఆకస్మాత్తుగా.. కూర్చున్న చోటే మరణించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో జరిగింది. కోవిడ్ పాజిటీవ్ రావడంతో ఆయన జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహలలోని కోవిడ్ సెంటర్​లో చికిత్స తీసుకుంటున్నాడు. గత రాత్రి ఎవరికి చెప్పకుండా సెంటర్​నుంచి బయటికి వెళ్లాడు.

covid patient died
బుజ్జి మృతదేహం

By

Published : May 9, 2021, 10:55 PM IST

తెనాలిలోని జగ్గడిగుంటపాలెంలోని టిడ్కో గృహాల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఓ వ్యక్తి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఆయన దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద మృతి చెంది ఉన్నాడు. అతడిది గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సుల్తానాబాద్​కు చెందిన బత్తుల బుజ్జి(51) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం బుజ్జికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన జగ్గడిగుంటపాలెం సమీపంలో టిడ్కో గృహాల్లోని కొవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స తీసుకున్నాడు.

వైరస్ సోకిందని మనస్థాపానికి గురైన ఆయన… గత రాత్రి కొవిడ్ కేర్ కేంద్రం నుంచి బయటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం రేవేంద్రపాడు కాలువ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన పలుమార్లు కాలువలో దిగాడని స్థానికులు తెలిపారు. కానీ ధైర్యం సరిపోక బయటకు వచ్చి పక్కనే ఉన్న దిమ్మపై కూర్చున్నాడు. నీరసంగా ఉన్న అతన్ని గుర్తించి స్థానికులు భోజనం పెట్టారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details