ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ సోకిన వృద్ధ దంపతులు అదృశ్యం.. ఆందోళనలో కుమార్తె, అల్లుడు - old couple missing in guntur

కొవిడ్ బారిన పడ్డ వృద్ధ దంపతులు అదృశ్యమైన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వృద్ధ దంపతులు ఏమయ్యారో తెలియక కుమార్తె, అల్లుడు ఆందోళన చెందుతున్నారు.

వృద్ధ దంపతులు అదృశ్యం
old couple missing in guntur

By

Published : May 25, 2021, 11:08 PM IST

గుంటూరులో కొవిడ్ సోకిన వృద్ధ దంపతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నగరంలోని అమరావతి రోడ్డులోని రామ బిల్డింగ్​లో నివాసముంటున్న దంపతులు వడ్లమూడి సంజీవరావు, సాయిజ్యోతి. ఇద్దరూ గత నెలలో కొవిడ్ బారినపడ్డారు. దీంతో వారిద్దరిని వారి కుమార్తె, అల్లుడు.. అడవితక్కెళ్లపాడులోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు. అనంతరం అల్లుడు, కుమార్తె వైరస్ బారిన పడటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కుమార్తె, అల్లుడు.. సంజీవరావు, సాయిజ్యోతి గురించి అడవితక్కెళ్లపాడులోని క్వారంటైన్ కేంద్రంలో ఆరా తీశారు. వారికి ఆరోగ్యం విషమించడంతో జీజీహెచ్​కు తరలించినట్లు చెప్పారు. జీజీహెచ్​లో అడిగితే అక్కడి సిబ్బంది తమకు సమాచారం లేదంటున్నారని సంజీవరావు అల్లుడు అనిల్ తెలిపారు. వృద్ధ దంపతులు ఏమయ్యారో తెలియక కుమార్తె, అల్లుడు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details