ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగ భద్రత కోసం.. మోకాళ్లపై నిలుచుని కొవిడ్ ఒప్పంద సిబ్బంది నిరసన - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వార్తలు

కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వారికి భరోసా కరువైంది. ఉద్యోగ భద్రత కోసం.. మోకాళ్లపై నిలుచుని కొవిడ్ ఒప్పంద సిబ్బంది నిరసన తెలిపారు. ప్రభుత్వం తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.

covid contract employees
ఉద్యోగ భద్రత కోసం

By

Published : Feb 8, 2021, 4:51 PM IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొవిడ్ ఒప్పంద సిబ్బంది చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజూ కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి కాంట్రాక్టు సిబ్బంది పెద్దఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఉద్యోగులు మోకాళ్లతో నిలబడి నిరసన గళం వినిపించారు. ప్రాణాలను లెక్కచేయకుండా కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తే ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్టు ముగిసిందని సిబ్బందిని తొలగించడం దారుణమన్నారు. మహిళలకు అండగా ఉన్నానని వాగ్దానాలు చేసే సీఎం జగన్.. మహిళలు రోడ్డు మీదకి వస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో నిరసన చేయడం సరైంది కాదని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details