రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టినట్లు.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేక అధికారి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ నిల్వ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఏపీలో రోజుకు 40 టన్నుల ప్రాణవాయువు కొరత ఉందని.. దీన్ని అధిగమించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సమీకరిస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ సహకారంతో.. గుజరాత్ జామ్నగర్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ గుంటూరు చేరుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రానివ్వం: కృష్ణబాబు
గుంటూరులోని ఆక్సిజన్ నిల్వ కేంద్రాన్ని.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేక అధికారి ఎం.టి.కృష్ణబాబు పరిశీలించారు. రాష్ట్రంలో ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేక అధికారి కృష్ణబాబు