గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 29 వేల 429కి చేరుకుంది. కరోనాతో ఇవాళ 9 మరణాలు సంభవించాయి. వీటితో కరోనా మరణాల సంఖ్య 306కు పెరిగింది. కరోనా మరణాల్లో గుంటూరు జిల్లా, కర్నూలుతో పాటు మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 19 వేల 584 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలో అత్యధికంగా 134, నరసరావుపేటలో 120 ఉన్నాయి. జిల్లాలోని మాచర్లలో 91, గురజాల 55, మంగళగిరి 52, వెల్దుర్తి 50, సత్తెనపల్లి 46, రెంటచింతల 44, బాపట్ల 44, తెనాలి 38, నాదెండ్ల 25, కొల్లిపొర 17, తాడేపల్లి 17, ఎడ్లపాడు 16, దాచేపల్లి 13, ముప్పాళ్ల 13, చిలకలూరిపేట 12, ఫిరంగిపురం 12, తాడికొండలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 86 కేసులు వచ్చాయని బులిటెన్ లో పేర్కొన్నారు.