రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం పాజిటివ్ కేసులు 9కి చేరాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాచేపల్లి, గుంటూరు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. మండలంలో రెడ్జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.
దాచేపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం - ap corona live updates
గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 4 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 9కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

దాచేపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు