ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల్లో కరోనా ఘంటికలు..విద్యార్ధులు, ఉపాధ్యాయులకు మహమ్మారి - గుంటూరులో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్

కొవిడ్ కారణంగా పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 2 నుంచి 9, 10 తరగతి పిల్లలకు తరగతులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. గుంటూరులో విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వైరస్ పరీక్షలు నిర్వహిస్తోంది. అనేకచోట్ల పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

covid cases in schools
పాఠశాలల్లో కరోనా కేసులు

By

Published : Nov 11, 2020, 8:45 PM IST

గుంటూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. విద్యాలయాల ప్రారంభంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో.. వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో పది మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఫిరంగిపురం ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు, నుదురుపాడులో, మేడికొండూరు మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులకు మహమ్మారి సోకినట్లు తేలింది. కొర్రపాడు, సిరిపురం, మందపాడు పరిధిలోని పాఠశాలల్లో ఐదుగురు, తుళ్లూరు మండలంలో నలుగురు విద్యార్థులు వైరస్ బారిన పడినట్లు వెల్లడైంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details