ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మరో 41 మందికి కరోనా పాజిటివ్ - కరోనా తాజావార్తలు

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. తాజా నివేదిక ప్రకారం 41 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 666 మంది మృతి చెందారు.

గుంటూరు జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు

By

Published : Jan 2, 2021, 7:05 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు క్రమేపి తగ్గు ముఖం పట్టాయి. జిల్లాలో తాజాగా 41 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేల 798 కి చేరింది. అత్యధికంగా గుంటూరులో- 9, భట్టిప్రోలు-5, తెనాలి-3, పెదనందిపాడు-3 పెదకాకాని-2 తుళ్లూరు-2 నరసరావుపేట-2 కేసుల చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. కొవిడ్ నుంచి కోలుకొని ఇప్పటివరకు 73 వేల 621 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 512 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details