గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు. వైద్యశాలలో 30 పడకలు ఉండగా.. 15 పడకలను కరోనా రోగుల చికిత్సకు వినియోగించనున్నారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నిడుబ్రోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 96 పడగల క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థన మేరకు... అధికారులను సీఎం ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.