ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్ మహల్​లో 70 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

జీజీహెచ్ నుంచి డిశ్ఛార్జ్ అయిన, స్పల్ప కరోనా లక్షణాలున్న వారి కోసం... కలెక్టర్ వివేక్ యాదవ్, రైల్వే డీఆర్‌ఎం మోహన్ రాజా, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్... కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రారంభించారు. ఆక్సిజన్​తో కూడిన 16 పడకలతో సహా మొత్తం ఇక్కడ 70 పడకలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

step down covid care center at rail mahal
రైల్​ మహల్​లో కొవిడ్ కేర్ సెంటర్

By

Published : May 11, 2021, 3:50 PM IST

గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ మహల్​లో.. 70 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. వీటిలో 16 పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. కరోనా మధ్యస్థ లక్షణాలు ఉన్న వారితో పాటు... జీజీహెచ్ నుంచి డిశ్ఛార్జ్‌ అయి స్వల్ప ఇబ్బందులున్న వారిని ఇక్కడకు తరలించి చికిత్స అందించనున్నారు. ఈ కొవిడ్ కేర్, స్టెప్‌డౌన్ సెంటర్​ను కలెక్టర్ వివేక్ యాదవ్, రైల్వే డీఆర్‌ఎం మోహన్ రాజా, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రారంభించారు.

ఇదీ చదవండి:భూటాన్​ ప్రధానికి మోదీ ధన్యవాదాలు

రైల్వే ఉద్యోగులకు ఇక్కడ 40 శాతం, సాధారణ ప్రజలకు 60 శాతం పడకలు కేటాయించనున్నారు. ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి రైల్వే విభాగం ఈ సెంటర్​ను ఏర్పాటు చేయడం.. సంతోషంగా ఉందని డీఆర్‌ఎం మోహన్ రాజా చెప్పారు.

ఇదీ చదవండి:

రెండో డోసు వ్యాక్సినేషన్.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యం

ABOUT THE AUTHOR

...view details