కరోనా కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గుంటూరు జిల్లా మాచర్లలో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. పట్టణంలో 26 ఆక్సిజన్ పడకలతో కొవిడ్ కేర్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా సమీప ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే అవసరం ఉండదని ఎంపీ పేర్కొన్నారు.
మాచర్లలో కొవిడ్ కేర్ కేంద్రం ఏర్పాటు - guntur district corona cases
గుంటూరు జిల్లా మాచర్లలో కొవిడ్ కేర్ కేంద్రాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభించారు. స్థానిక ప్రజల ఇబ్బందుల దృష్ట్యా... ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
మాచర్లలో కొవిడ్ కేర్ కేంద్రం ఏర్పాటు