కరోనా బారిన పడి మృత్యవాత చెంది దహన సంస్కారాలు నోచుకోని మృతదేహాలకు ...అన్ని తామే అంటూ ముందుకు వస్తున్నారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్. గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందిన కరోనా రోగులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కరాలు నిర్వహించారు. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన 8 మందికి అంత్యక్రియలు చేసినట్లు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహుకులు జ్ఞాన ప్రసన్న బాబా తెలిపారు. ఆర్థిక స్తోమత లేనివారు తమని సంప్రదిస్తే అంత్యక్రియలు చేయడానికి.. మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు.
అంతిమ సంస్కారంలో అన్నీ తామై..!
కరోనా బారినపడి చనిపోతే అంత్యక్రియలకు నోచుకుని దైన్యస్థితిని అనేకచోట్ల చూస్తున్నాం. అలాంటి మృతదేహాలకు దహన సంస్కారాలు ఉచితంగా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది అమ్మఛారిటబుల్ ట్రస్ట్. గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందిన కొవిడ్ రోగులకు వీరు అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా మృతులకు ఉచితంగా అంత్యక్రియలు