ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఆత్మహత్యకు యత్నించింది. వీరిలో భర్త చనిపోగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల సమీపంలోని కొండపై మంగళ వారం చోటుచేసుకుంది. సీఐ సుబ్రహ్మణ్యం కథనం మేరకు... ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలంలోని చిన్న ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన వెండి దండి పృథ్వీ(25) హైదరాబాద్ లోని జవహర్ నగరి వాసి షేక్ పర్హనా(20) మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో శీతల పానియాలతో ఉండవల్లి గుహల సమీపంలోని కొండపైకి వెళ్లారు.
అక్కడున్న కొందరు బాలలు చూసి తల్లిదండ్రులకు తెలిపారు. జంట ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో అనుమానంతో స్థానికులు కొండపైకి వెళ్లగా నోటి నుంచి నురగలు కక్కుతూ ఇద్దరు పడి ఉండటం చూశారు. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చి ఇద్దరిని లేపడానికి ప్రయత్నించారు. అప్పటికే పృథ్వీ చనిపోయినట్లు గ్రహించారు. యువతి అపకస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు ఆమెను కొండ పై నుంచి మోసుకొచ్చి అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అంతకుముందే సమాచారంతో ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో ఫోన్ నంబర్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాయంతో చిన్నముప్పాళ్ల పాడులోని అతని తండ్రి గోపాల్‌రెడ్డికి విషయం చేరవేశారు. కొంత కాలం క్రితం తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో పృథ్వీ పండ్ల వ్యాపారం చేశారు.
ఇటీవల హైదరాబాద్ వెళ్లిన అతను జవహర్ నగర్ లో అదే వ్యాపారం మెుదలు పెట్టారు. అక్కడే పర్హానాను ప్రేమించాడు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. మరో వైపు ఆమె తల్లి దండ్రులు అక్కడి పోలిస్ స్టేషన్ తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.