ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide Attempt: అధికారులు వేధిస్తున్నారంటూ.. దంపతుల ఆత్మహత్యాయత్నం - couple suicide attempt at yerrabalem guntur district news

గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో అక్రమ భవన నిర్మాణాన్నికూల్చేందుకు వెళ్లిన అధికారులపై యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వేధిస్తున్నారంటూ భవన యజమాని అతని భార్య ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారులు వేధిస్తున్నారంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం
అధికారులు వేధిస్తున్నారంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 30, 2021, 8:33 PM IST

అధికారులు వేధిస్తున్నారంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో.. అక్రమ నిర్మించిన భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన అధికారులపై యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ ప్లాన్ మంజూరు చేయాలని కోరినందుకు అధికారులు వేధిస్తున్నారంటూ భవన యజమాని అంజయ్య, అతని భార్య ఒంటిపై డీజిల్ పోసుకున్నారు.

అంజయ్య వ్యవహార శైలిపై నగరపాలక టౌన్ ప్రణాళికా విభాగం అధికారులు.. మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా ఆత్మహత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details