ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిక్​టాక్​తో ఒక్కటయ్యారు.. ఒక్కటిగా తనువు చాలించారు! - గుంటూరు దంపతుల ఆత్మహత్య న్యూస్

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. టిక్​టాక్​లో పరిచయమై పెళ్లి చేసుకున్న వీరికి.. యువతి తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు రావడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

couple sucide in gunturu
couple sucide in gunturu

By

Published : Sep 3, 2020, 10:59 PM IST

Updated : Sep 4, 2020, 12:32 AM IST

చిత్తూరు జిల్లా కోటగుడిబండకు చెందిన కూటాల శైలజ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దద్దనాల పవన కుమార్ 10 నెలల క్రితం టిక్​టాక్​లో పరిచయమయ్యారు. అది కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమకు అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకొక పోవడంతో నెల క్రితం తిరుపతి వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయ పాలెంలో కాపురం పెట్టారు. అయితే యువతి తల్లిదండ్రులు శైలజని తమ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే పవన్ కుమార్ ని చంపుతామని బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు బయపడిన దంపతులు గురువారం ఇంట్లో ఫ్యాన్​కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు యువతి తల్లిదండ్రులు కారణమని సూసైడ్ నోట్​లో పేర్కొన్నారు.

Last Updated : Sep 4, 2020, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details