COUPLE PROTEST AT CM HOUSE: ఎన్టీఆర్ జిల్లా పెనుమలూరుకు చెందిన భార్యాభర్తలు జ్ఞానేంద్ర, అనూషలు ప్రేమించుకుని 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేరు కావడం వల్ల వేరే దగ్గర బతుకుతున్నారు. తాజాగా ఆస్తి కోసం బంధువులు దాడులు చేస్తున్నారని.. ముఖ్యమంత్రి జగన్ ఆదుకోవాలని గురువారం ఆయన నివాసానికి సమీపంలో ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. నిన్న రాత్రి బంధువులు మళ్లీ తమపై దాడికి యత్నించారని.. నేడు మళ్లీ ఆందోళనకు దిగారు.
ప్రాణహాని ఉందంటూ సీఎం నివాసం వద్ద దంపతుల ఆందోళన.. పోలీసులు ఏం చేశారంటే?
COUPLE PROTEST AT CM HOME : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. 2016లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా బంధువులు ఆస్తి కోసం దాడులకు పాల్పడుతున్నారని.. ముఖ్యమంత్రే న్యాయం చేయాలని ఆయన నివాసం సమీపంలో గురువారం ఆందోళన చేపట్టారు. అయితే గమనించి పోలీసులు ఆ దంపతులకు సర్దిచెప్పి పంపించారు. అయితే తాజాగా నేడు మరోసారి ఆందోళనకు దిగారు.
COUPLE PROTEST AT CM HOUSE
ఆస్తికోసం హత్య చేయించేందుకు సైతం వెనుకాడటం లేదని.. న్యాయం జరిగే వరకు ఇక్కడ్నుంచి కదలబోమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని అనుచరులమంటూ తమపై దాడి చేశారని వాపోయారు. అయితే అనూష బంధువులతో ఫోన్లో మాట్లాడిన పోలీసులు.. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: