నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. ఓ జంట బ్యాంకును మోసం చేసిన ఘటన.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో జరిగింది. నకిలీ పాసు పుస్తకాలతో రూ.9 లక్షలు రుణం తీసుకున్న దంపతులు.. అన్నాచెల్లెల్లమని చెప్పి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే.. వారు రుణం చెల్లించకపోవటంతో.. బ్యాంకు ఆరా తీయగా..నకిలీ పాసు పుస్తకాలతో రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఘటనపై.. నరసారావుపేట పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను పట్టుకోగా.. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.9లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. బ్యాంకుకు దంపతుల టోకరా..! - couple cheated bank with fake pass books news
వారు చూపించినవి.. నకిలీ పాసు పుస్తకాలు. కానీ చూడటానికి అచ్చు అసలులాగే ఉన్నాయి. దీంతో బ్యాంకు అధికారులు మోసపోయి.. వారికి రుణం ఇచ్చారు. తీరా.. నిందితులు రుణం చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. అప్పటికి గాని తెలియలేదు.. అవి నకిలీవని. ఈ మోసపూరిత ఘటన.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో జరిగింది.

నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. బ్యాంకుకు దంపతుల టోకరా..!
TAGGED:
ap latest news