వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి
వైకాపా నవరత్నాలే విజయానికి కారణం: మేకతోటి - guntur
ఏపీ ప్రజలు మరోసారి చారిత్రక నిర్ణయాన్ని ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్పై వైకాపా నేత మేకతోటి సుచరిత విజయం సాధించారు.

వైకాపా నేత మేకతోటి సుచరిత
వైకాపా నవరత్నాల హామీలే పార్టీ ఘన విజయానికి దోహదపడిందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైకాపా ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై సుచరిత విజయం సాధించారు. తెదేపా హామీలను ప్రజలు నమ్మలేదని సుచరిత అన్నారు.