ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ ఎన్నికల జడ్జిమెంట్ రేపే - కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి - తెలంగాణ ఎన్నికల కౌంటింగ్

Counting Arrangements Completed by EC : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు.

telangana_election
telangana_election

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 5:23 PM IST

Updated : Dec 2, 2023, 6:56 PM IST

Counting Arrangements Completed by EC :తెలంగాణశాసనసభ ఎన్నికల(Telangana Elections) ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కేంద్రం ఉండగా మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.

ఎన్నికల కౌంటింగ్​కు ఛత్తీస్​గఢ్​ రెడీ- అధికార పీఠం ఎవరిదో?

Telangana Elections results 2023 :ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు లెక్కింపు (telangana election counting) కోసం ఎన్నికల సంఘం(EC) 14 చొప్పున టేబుల్ ఏర్పాటు చేయగా, పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరొక టేబుల్ ఏర్పాటు చేస్తారు. 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో అక్కడ లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి.

మొదట ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ఒకవేళ చివరి రౌండ్ లోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే పూర్తయిన తర్వాతే చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు.

మధ్యప్రదేశ్​పైనే అందరి దృష్టి- ఎగ్జిట్​ పోల్స్​ చెప్పినట్లు హోరాహోరీనా? మెజారిటీతో విజయమా?

Assembly Elections Counting in Telangana :ప్రతి టేబుల్​పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఉదయం పదిన్నర ప్రాంతంలో మొదటి ఆధిక్యం తెలిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని 144 సెక్షన్ అమలు ఉంటుందనీ రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు.

ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ సరూర్​ నగర్‌ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో నాలుగు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ర్యాలీలకు, బాణాసంచాలకు అనుమతి లేదని తెలిపారు.

శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ యత్నం : డీకే శివకుమార్‌

Last Updated : Dec 2, 2023, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details