గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆపరేషన్ ముస్కాన్ భాగంగా బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలో వివిధ దుకాణాల్లో పని చేస్తున్న బాల కార్మికులను, వారి తల్లిదండ్రులను, దుకాణ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి పట్టణ సీఐ ప్రభాకర్ రావు సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు. పిల్లలను పనుల కోసం దుకాణాలకు పంపిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ రావు, తల్లిదండ్రులకు, దుకాణదారులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి వరప్రసాదరావు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
పిడుగురాళ్లలో బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో వివిధ దుకాణాల్లో పని చేస్తున్న బాల కార్మికులకు, వారి తల్లిదండ్రులకు, దుకాణ యజమానులకు పట్టణ సీఐ ప్రభాకర్ రావు గారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
పిడుగురాళ్లలో బాలకార్మికులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్