గుంటూరు జిల్లాలో గురువారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 మార్కెట్ యార్డులు, 19 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయనున్నారు. వీటి ధరలను ఇప్పటికే సీసీఐ నిర్ణయించింది. పొట్టి పింజ రకాలకు రూ. 5,515, పొడవు పింజ రకాలు రూ. 5,825 ఖరారు చేసింది.
ప్రస్తుతం బయటి మార్కెట్లో ఒక క్వింటా ధర 4వేల లోపే ఉండటంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకే తీసుకు వచ్చే అవకాశం ఉంది. పత్తి అమ్మదలచుకున్నవారు ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అక్కడ కేటాయించిన స్లాట్ నంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు.