గుంటూరు జిల్లా పెదనందిపాడు వ్యవసాయ కార్యాలయం వద్ద పత్తి రైతులు ఆందోళన చేశారు. ఈ క్రాప్ బుకింగ్‌లో పేర్లు కనిపించడం లేదని అధికారులు, సీసీఐ కొనుగోలు కేంద్రం వారు ఆరోపణలు చేసుకుంటూతమ సమస్యలను పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు ఆన్లైన్లో కాకుండా పాత పద్దతిలోనే చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని... సీసీఐకి పత్తి విక్రయించాలంటే పేర్ల నమోదు పేరుతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
పెదనందిపాడు వ్యవసాయ కార్యాలయం వద్ద పత్తి రైతుల ఆందోళన - cotton formars protest in guntur latest news
గుంటూరు జిల్లా పెదనందిపాడు వ్యవసాయ కార్యాలయం వద్ద పత్తి రైతులు ఆందోళన. అధికారులు తమ సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెదనందిపాడు వ్యవసాయ కార్యాలయం వద్ద పత్తిరైతుల ఆందోళన