కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గుంటూరు జిల్లాలోని పత్తి రైతులు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డుకు సమీప ప్రాంతాల నుంచి అమ్మేందుకు పత్తిని తీసుకువచ్చారు. తూకాలు, నాణ్యత పేరుతో వ్యాపారులు వెనక్కు పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సత్తెనపల్లి మార్కెట్ యార్డు వద్ద పత్తి రైతుల ఆందోళన - cotton farmers agitation news
గుంటూరు జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ వాపోయారు.
వ్యాపారుల అక్రమాలపై అధికారులకు చెప్పినా.. పట్టించుకోవటం లేదంటూ సత్తెనపల్లి-హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా ఉంచి ఆందోళన చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తి అమ్మేందుకు రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. కేవలం సిఫార్సులతో వచ్చిన వారి వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: గుంటూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్