ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పువ్వు పూయలే.. కాయ కాయలే! - farmeers

అన్నం పెట్టే అన్నదాతంటే అందరికీ అలుసే..! విత్తు నుంచి పంట చేతికొచ్చే వరకూ రైతు బతుకు దినదిన గండమే.!? గుంటూరు జిల్లాలో 'నకిలీ' కాటేసి ఆరేళ్లు అవుతోంది. కానీ నేటికీ పరిహారం లేదు. తిరిగీ తిరిగీ కాలరుగుతోంది.. కానీ పరిష్కారం లేదు. కర్షకునిపై పాలకులు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో... చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది.

పువ్వు పూయలే.. కాత కాయలే!

By

Published : Jun 8, 2019, 6:28 AM IST

పువ్వు పూయలే.. కాత కాయలే!

విత్తన కంపెనీల మాయాజాలానికి అన్నదాతలు ఏటా నష్టపోతూనే ఉన్నారు. ఆ తర్వాత పరిహారం పేరిట మళ్లీ దగా పడుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కల్తీ, నకిలీ విత్తనాలతో రైతులు దెబ్బతింటే ఆదుకునే సమగ్ర విత్తనచట్టం లేకపోవడం రైతుకు నిజంగా శాపమే!


బయ్యవరం రైతుల వ్యథ...
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన ఈ రైతులంతా ఓ పేరున్న కంపెనీ విత్తనాలను నాటారు. గతంలో వాడిన ధీమాతో గ్రామ రైతులంతా అవే విత్తనాలను వినియోగించారు. తీరా పంట ఎదిగాక అసలు విషయం బయటపడింది. పువ్వు సరిగా వికసించక... కాయలు సరిగ్గా కాయకపోవడంతో నష్టపోయినట్లు రైతులు గ్రహించారు. లబోదిబోమని గుండెలవిసేలా రోదించారు.

ఆరేళ్ల పోరాటం...
బయ్యవరం మోసానికి ఆరేళ్లు పూర్తవుతోంది. వ్వవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సహా గ్రామంలో పర్యటించి... 40 శాతం వరరూ పంట నష్టపోయినట్లు నిర్ధారించారు. దీనికి కల్తీ విత్తనాలే కారణమని తేల్చేశారు. ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో రైతులకు ఇవ్వవలసిన పరిహారాన్ని వ్యవసాయ శాఖ జేడీ ఖాతాలో వేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. సుమారు 6 లక్షల రూపాయల మేరకు పరిహారాన్ని కంపెనీ ప్రతినిధులు జమ చేశారు. అక్కడి నుంచి ఈ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఆ పరిహారం రైతులకు అందడం లేదు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాలకు రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రయాస తప్ప పరిహారం అందడం లేదు. కోర్టు పరిధిలో ఉన్నందున... తామేమీ చేయలేమని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


"పంట పండితే విత్తనాల గొప్పతనం... లేదంటే రైతుల దురదృష్టం..." ఇదీ కంపెనీల అభిప్రాయం. 'లాభాలొస్తే అధికారుల కష్టఫలం... నష్టమొస్తే అన్నదాతల నిర్లక్ష్యం..." ఇదీ యంత్రాంగం అభియోగం. తప్పెవరిదైనా, కారణమేదైనా... చివరికి ప్రాణాలొదిలేది మాత్రం కర్షకుడే కదా!

ఇదీ చదవండీ: 'మెరుపు' వరదలతో ఒక్లహోమా జలమయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details