గుంటూరు జిల్లాలో వైకాపా భారీ విజయాలు సాధించింది. వినుకొండ, సత్తెనపల్లి, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె మున్సిపాలిటీలు అధికార పక్షం వశమయ్యాయి. తెనాలి, చిలకలూరిపేటలో మాత్రమే తెలుగుదేశం ఓ మోస్తరు స్థానాలు సాధించింది. తెనాలి 16వ వార్డులో ఫలితం ఉత్కంఠ రేపింది. తెలుగుదేశం అభ్యర్థి దివి అనిత కేవలం 4 ఓట్లతో గెలిచారు. అక్కడ 3 సార్లు కౌంటింగ్ నిర్వహించారు.
కృష్ణాజిల్లాలో...
కృష్ణాజిల్లా పెడనలో వైకాపా భారీ విజయం సాధించింది. ఉయ్యూరు నగర పంచాయతీని కైవసం చేసుకొంది. నందిగామ అధికార పక్షం వశమైంది.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకొంది. నరసాపురంలోనూ వైకాపా జెండా ఎగరగా... జనసేన 4 స్థానాల్లో గెలిచింది. నిడదవోలు, జంగారెడ్డి గూడెంలో ఫ్యాన్ పార్టీకి భారీ విజయాలు దక్కాయి.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో వైకాపా ఘన విజయం సాధించింది. అక్కడ మొత్తం 30 వార్డులుండగా... అన్నీ వైకాపా సొంతమయ్యాయి. ఏలేశ్వరంలోనూ భారీ విజయం దక్కింది. పిఠాపురంలో 30 స్థానాలకు గాను 20 చోట్ల వైకాపా జెండా ఎగిరింది. మండపేట మున్సిపాలిటీని సొంతం చేసుకున్న ఆ పార్టీ... గొల్లప్రోలు నగర పంచాయతీలోనూ భారీ విజయం సాధించింది.