గుంటూరు జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా గురువారం ఒక్క రోజులోనే రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 6 రోజుల్లో మొత్తంగా 1,351 కేసులు వెలుగు చూశాయి.
నగరంలోనే 100కిపైగా..
తాజాగా ఒక్క గుంటూరు నగర పరిధిలోనే వందకుపైగా కేసులను గుర్తించారు. నగరంలో 104 కేసులు, తెనాలిలో 62 కేసులు నమోదయ్యాయి. తెనాలి 62, మంగళగిరి 31, రేపల్లె 13, చుండూరు 10, దుగ్గిరాల 10 కేసులను గుర్తించారు.