ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా డ్రై రన్ లోటుపాట్లపై ప్రభుత్వానికి ఫీడ్ ​బ్యాక్: కలెక్టర్ ​

కొవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ డ్రై రన్​లో గుర్తించిన అంశాలపై గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్‌ డ్రై రన్‌లో గుర్తించిన సాంకేతిక లోటుపాట్లు, కొవిన్‌ యాప్‌లో అదనపు వివరాలు నమోదు, ఎడిట్‌ అప్షన్‌ కొరకు ప్రభుత్వానికి ఫీడ్‌ బ్యాక్‌ అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

By

Published : Jan 2, 2021, 10:28 PM IST

కరోనా డ్రై రన్ లోటుపాట్లపై ప్రభుత్వానికి ఫీడ్ ​బ్యాక్
కరోనా డ్రై రన్ లోటుపాట్లపై ప్రభుత్వానికి ఫీడ్ ​బ్యాక్

కొవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ డ్రై రన్​లో గుర్తించిన అంశాలపై గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. డ్రై రన్ ఫీడ్‌ బ్యాక్​ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్‌..వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. వాక్సినేషన్‌ కేంద్రాల వారీగా డ్రై రన్​లో గుర్తించిన అంశాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వివరాల నమోదు, పరిశీలన సమయంలో ఆధార్‌ కార్డుకు ఓటీపీతో పాటు బయోమెట్రిక్‌ సదుపాయం కల్పించాలన్నారు. కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ సమయంలో జరిగిన తప్పులను సవరించుకునేందుకు ఎడిట్‌ అప్షన్‌ ఇవ్వాలన్నారు. సీఆర్‌ఎఫ్‌ ఫారమ్‌ సిస్టం నుంచే డౌన్‌లోడ్‌ అయ్యేలా ఏర్పాటు ఉండాలన్నారు.

ఏఈఎఫ్‌ఐ చికిత్స అవసరమైన వారికి దరఖాస్తు ఫారమ్‌లో పర్సనల్‌ వివరాలు అడుగుతున్నారని..అందువల్ల వ్యాక్సినేషన్‌కు వచ్చే వారి పర్సనల్‌ వివరాలు ముందుగానే తీసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. డ్రై రన్‌ విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్‌ శామ్యూల్‌ అధికారులను అభినందించారు. వాక్సినేషన్‌ డ్రై రన్‌లో గుర్తించిన సాంకేతిక లోటుపాట్లు, కొవిన్‌ యాప్‌లో అదనపు వివరాలు నమోదు, ఎడిట్‌ అప్షన్‌ కొరకు ప్రభుత్వానికి ఫీడ్‌ బ్యాక్‌ అందించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details