గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 114 కేసులు నమోదవ్వగా.. మొత్తం బాధితుల సంఖ్య 73,397కి చేరింది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు నగరంలో అత్యధికంగా 36 మందికి మహమ్మారి సోకింది. తాడేపల్లిలో 12, రేపల్లెలో 9, బాపట్లలో 6, మంగళగిరిలో ఐదుగురు చొప్పున వైరస్ బారినపడ్డారు.
జిల్లాలో ఇప్పటి వరకు 71,831 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 913 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైరస్ కారణంగా ఇవాళ ఒకరు మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 653కి చేరిందని వైద్యధికారులు వెల్లడించారు.