గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 72కేసులు నమోదవ్వగా మొత్తం బాధితుల సంఖ్య 73,127కి చేరింది. గుంటూరు నగరంలో అత్యధికంగా 17మంది మహమ్మారి బారినపడ్డారు. రేపల్లెలో 8, పెదకాకానిలో 6, నరసరావుపేటలో4, వట్టిచెరుకూరులో4 చొప్పున కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 71,337మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. వైరస్‌తో మొత్తం 651మంది మృతి చెందారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది.