గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 26వేల 559కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 132 ఉన్నాయి. ఆ తర్వాత నర్సరావుపేటలో 90, కారంపూడి 53, తెనాలి 39, యడ్లపాడు 23, సత్తెనపల్లి 17, ప్రత్తిపాడు 13, మాచర్ల 11, బాపట్ల 11, చిలకలూరిపేట11, పెదకూరపాడు 10, వినుకొండ 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 107 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా నుంచి జిల్లాలో 16వేల 882 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా శుక్రవారం నాడు 10మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 275కు చేరుకుంది. కరోనా మరణాలు రోజురోజుకీ పెరుగుతుండటం అధికారుల్ని కలవరపరుస్తోంది. ఇందులో 10మంది మాత్రమే ఇళ్లలో మరణించారు. మిగతావారు ఆసుపత్రుల్లోనే చనిపోయారు. ఆసుపత్రుల్లో వైద్యం మెరుగుపర్చే క్రమంలో ప్లాస్మా చికిత్స ప్రారంభించారు.