ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోయంబేడు కలవరం... అప్రమత్తమైన అధికారులు

రాష్ట్రంలో నిన్న కొత్తగా నమోదైన 33 కరోనా పాజిటివ్ కేసుల్లో 20 మంది కోయంబేడు మార్కెట్​తో సంబంధమున్నవారే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్కెట్​కు వెళ్లిన లారీ డ్రైవర్లు, క్లీనర్లకు కరోనా పరీక్షలు మెుదలుపెట్టారు.

koyambedu market effect on ap
కోయంబేడు కలవరం

By

Published : May 13, 2020, 9:22 AM IST

కోయంబేడు మార్కెట్​పై అధికారులు దృష్టి సారించారు. ఆ మార్కెట్​తో సంబంధమున్న వారికి కరోనా పాజిటివ్​గా రావటంతో రాష్ట్రంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కోయంబేడుతో సంబంధం ఉన్న వారికే కరోనా పాజిటివ్​గా వచ్చింది. గుంటూరు జిల్లా నుంచి కోయంబేడు మార్కెట్​కు వెళ్లివచ్చిన లారీ డ్రైవర్లు, క్లీనర్లు సుమారుగా 140 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వారిలో 50 మందిని క్వారంటైన్​కు తరలించి కరోనా పరీక్షలు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details