ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో వైద్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు - గుంటూరు జీజీహెచ్​లో వైద్యులు సిబ్బందికి కరోనా పరీక్షల వార్తలు

గుంటూరు జీజీహెచ్​లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం 1200 పడకలుండగా... అందులో 700 కొవిడ్ రోగుల కోసం, మరో 500 ఇతరులకు కేటాయించామన్నారు.

corona tests to guntur ggh staff
జీజీహెచ్​లో వైద్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు

By

Published : Jul 18, 2020, 2:50 PM IST

గుంటూరు జీజీహెచ్​లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఇప్పటికే ముగ్గురికి పాజిటివ్​గా తేలటంతో వారిని ఐసోలేషన్​కు పంపినట్లు చెప్పారు. ఆసుపత్రిలో మొత్తం 1200 పడకలుండగా... అందులో 700 కొవిడ్ రోగుల కోసం, మరో 500 ఇతరులకు కేటాయించామన్నారు.

ఆసుపత్రి పాత విభాగం మొత్తం కొవిడ్ కోసం పనిచేస్తోందని తెలిపారు. అక్కడ పనిచేసే సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. ఇక నాన్ కొవిడ్ విభాగంలో వారికి కూడా ఎన్ 95 మాస్కులు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్​లో 280 మంది కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details