ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో పోలీసులకు, ఆశా కార్యకర్తలకు కరోనా పరీక్షలు - covid tests in chilakalooripeta

గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఓ హోంగార్డుకు కరోనా సోకటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. అక్కడి సిబ్బందికి, పట్టణం లో పనిచేసే ఆశా కార్యకర్తలకు వైద్య కళాశాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కోవిడ్-19 పరీక్షలను నిర్వహించింది.

corona tests for police families
చిలకలూరిపేటలో పోలీసులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు

By

Published : Apr 15, 2020, 6:20 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన హోంగార్డుకు కరోనా పాజిటివ్ రావటంతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. అతనితో కలసి పనిచేసిన పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు గుంటూరు వైద్య కళాశాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కరోనా పరీక్షలను నిర్వహించింది.. వీరితో పాటు పట్టణం లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు సైతం పరీక్షలు చేసి ల్యాబ్​కు పంపించారు.

ఇవీ చూడండి-అంతకంతకూ వైరస్ వ్యాప్తి.. అసలా జిల్లాకు ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details