పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. గ్రామాల్లో క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 105 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాడికొండ మండలంలో ఇప్పటివరకు మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా మేడికొండూరు, పేరేచర్ల, కొర్రపాడు, పొట్లపాడు, జంగంగుంట్ల పాలెం, డోకిపర్రు గ్రామానికి చెందిన 105 మందికి కరోనా పరీక్షలు చేశారు.
మేడికొండూరులో 105 మందికి కరోనా పరీక్షలు - ఏపీ కొవిడ్ న్యూస్
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో ఇప్పటి వరకూ 17 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా సోకిన వారి ప్రైమరీ, సెంకరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. మండలంలోని మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లోని 105 మందికి కరోనా పరీక్షలు చేశారు.
మేడికొండూరులో 105 మందికి కరోనా పరీక్షలు
Last Updated : Jul 14, 2020, 9:43 AM IST