ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భట్టిప్రోలులో ఆంక్షలు.. ఉదయం 11 గంటల వరకే దుకాణాలు - guntur district corona cases

గుంటూరు జిల్లా తీర ప్రాంతాల్లో కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కరోనా నియంత్రణకు అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు.. భట్టిప్రోలు మండలంలో ఉదయం పదకొండు గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందని స్థానిక ఎమ్మార్వో తెలిపారు. నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

corona rules strictly following in bhattiprolu guntur district
భట్టిప్రోలులో కరోనా కేసులు

By

Published : Apr 1, 2021, 3:20 PM IST

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా... నేటి నుంచి అత్యవసర దుకాణాలు మినహా అన్ని రకాల దుకాణాలను ఉదయం 11 గంటలకే మూసివేయాలని స్థానిక ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ ఆదేశించారు.

అనవసరంగా రోడ్లపైకి రాకూడదని, విధిగా మాస్కు ధరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. ఇప్పటి వరకు మండలంలో 90 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్​తో ఒకరు చనిపోయినట్టు తెలిపారు. వారం రోజుల పాటు నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details