గుంటూరులో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా తాకిడి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడగా ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఈ కారణంగా.. బోర్డు కార్యాలయాన్ని ఈనెల 19 వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. పారిశుద్ధ్య చర్యల అనంతరం 20న ఇంటర్ బోర్డు తెరుస్తామని కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఉద్యోగుల రక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.