ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న 15 మంది డిశ్చార్జ్​ - ap latest covid news

మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి నుంచి 15 మంది కరోన సోకిన వ్యక్తులు కోలుకుని ఆదివారం రాత్రి డిశ్చార్జ్​ అయ్యారు. వీరికి ప్రభుత్వం ప్రకటించిన నగదును తెనాలి ఉప కలెక్టర్​ దినేష్​ కుమార్​ అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

corona positive patients cured and discharged from nri hospital in managalagiri
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో కోలుకున్న 15 మంది కొవిడ్​ బాధితులు

By

Published : Apr 20, 2020, 5:49 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా పాజిటివ్ రోగులను ఆదివారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. వీరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల గత నెల 30 నుంచి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స అందించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 మందిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకుంటామని తెనాలి ఉప కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 వేలను వారికి అందించారు. డిశ్చార్జ్​ అయిన వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నుంచి విడుదలైన వారిలో గుంటూరు, మాచర్ల, అచ్చంపేటకు చెందిన 12 మంది ఉన్నారు. మంగళగిరి, మేడికొండూరు, క్రోసూరు మండలాలకు చెందిన వారు ఒక్కొక్కరు విడుదలయ్యారని ఎన్నారై ఆసుపత్రి సూపరింటెండెంట్​ మస్తాన్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details