సచివాలయం ఐటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం ఉద్యోగులందరికీ సచివాలయంలో కోవిడ్-19 టెస్ట్‌లు నిర్వహించారు. ఆ పరీక్షల్లో చిలకలూరిపేటలో నివాసం ఉంటూ రోజు విధులకు వస్తున్న ఈయనకి పాజిటివ్ నిర్ధరణ కావడంతో వైద్యాధికారులు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఆ యువకుడు ఉన్న ప్రాంతాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అతనితో సంబంధం ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. వైద్యాధికారులు సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు.
సచివాలయం ఔట్సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్
సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ కేసుతో కలిపి నియోజకవర్గంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 17కు చేరింది.
సచివాలయం ఔట్సోర్సింగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్