గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తుంది. గురువారం ఒక్క రోజే నియోజకవర్గంలో 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో 22 కేసులు, రూరల్ మండలంలో 13, నాదెండ్ల మండలంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు సంఖ్య 250 దాటింది. పట్టణంలో 150 మందికి పైగా బాధితులు ఉన్నారు. దీంతో శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
చిలకలూరిపేటలో కరోనా ఉద్ధృతి - చిలకలూరిపేట కరోనా అప్డేట్
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో గురువారం ఒక్క రోజే 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోనే కేసుల సంఖ్య 150 దాటడంతో శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
చిలకలూరిపేటలో పెరుగుతున్న కరోనా కేసులు