గుంటూరులో వేగంగా వ్యాపిస్తున్న కరోనా - గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు న్యూస్
గుంటూరులో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 9 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. జిల్లాలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 577కి చేరింది.
గుంటూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
By
Published : Jun 8, 2020, 7:56 PM IST
గుంటూరులో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. తాజాగా జిల్లాలో 9 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 577కి చేరింది.
కొత్తగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు
ప్రాంతం
కొత్తగా నమోదైన కేసుల సంఖ్య
నవులూరు
4
ముత్యాలరెడ్డి నగర్
1
నగరంపాలెం
1
నరసరావుపేట
1
పెదవడ్లపూడి
1
బాపట్ల
1
నవులూరులో నమోదైన 4 కేసులు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించినవి. వారం రోజుల క్రితం ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల అతని సన్నిహితులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో గుంటూరు నగరంలో 218 మంది కరోనా వైరస్ బాధితులుండగా.. నరసరావుపేటలో ఈ సంఖ్య 201కి చేరింది.