గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. ఇవాళ మరో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 413 కి చేరింది. తాజాగా నిర్ధారణ అయిన 9 కేసుల్లో గుంటూరు నగరంలో 6 కేసులు ,తాడేపల్లి, పెనుమాక, నరసరావుపేటలో మరో 3 కేసులు నమోదు అయ్యాయి. కోయంబేడు మార్కెట్ కాంటాక్టు ప్రభావిత కేసు పెనుమాకలో తొలిసారిగా నమోదైంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా గుంటూరులో 180 కేసులు, హాట్ స్పాట్ నరసరావుపేటలో మరో 178 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 148 కరోనా యాక్టివ్ కేసులుండగా....మరో 257 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
జిల్లాలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా కేసుల సంఖ్య
గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 413 కు చేరింది.
corona positive cases in guntur